VIDEO: షార్ట్ సర్క్యూట్.. పూరి గుడిసె దగ్ధం
KMR: మాచారెడ్డి మండలం నడిమితండాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భూక్యా పద్మ పూరి గుడిసెకు షార్ట్ సర్క్యూట్‌తో మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు స్పందించి మంటలను ఆర్పివేశారు. కాగా, అప్పటికే ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధిత కుటుంబ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.