ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు రాఖీ

ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు రాఖీ

విశాఖ: పాయకరావుపేట నియోజకవర్గం కోటవురట్ల మండలం అక్సాయిబ్ పేట గ్రామంలో సినీటుడు అల్లు రామకృష్ణ(రాఖీ)ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చి స్వగ్రామం అక్సాయిబ్ పేటలో ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ.. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలనికోరారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కృషి చేసిన పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు.