VIDEO: దిత్వా తుఫాన్ ఎఫెక్ట్.. నీట మునిగిన పొలాలు
NLR: బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో గత రెండు రోజులుగా నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కోవూరు మండలంలోని పలు ప్రాంతాల్లో పొలాలు నీట మునిగాయి. ఇనమడుగు, లేగుంటపాడు, వేగురు, తదితర గ్రామాల వద్ద పొలాల్లో నీరు భారీగా చేరుకున్నది. వ్యవసాయ పనులకు వర్షాలు అడ్డంకిగా మారాయని రైతులు వాపోయారు.