మూడు నియోజకవర్గాలు.. ఒక జిల్లా
SRCL: జిల్లాలో జరిగిన రెండవ విడత పంచాయతీ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఆదివారం ఎన్నికలు నిర్వహించిన మూడు మండలాలు మూడు వేర్వేరు నియోజకవర్గాలకు చెందినవి కావడమే ఆ ప్రత్యేకత. తంగళ్ళపల్లి మండలం సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలో ఉండగా, ఇల్లంతకుంట మండలం మానకొండూరు నియోజకవర్గంలో భాగంగా ఉంది. బోయినపల్లి మండలం చొప్పదండి మండలంలో కొనసాగుతోంది.