VIDEO: మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం: మంత్రి

WNP: ప్రభుత్వం అందిస్తున్న ఉపాధి అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకొని జీవితంలో రాణించాలని మంత్రి జూపల్లికృష్ణారావు సూచించారు. ఆదివారం వీపనగండ్ల ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరా మహిళాశక్తి పథకం ద్వారా మంజూరైన 19 మంది మైనార్టీ మహిళలకు మంత్రి కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..నిరుపేద మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు.