అమృత స్కీం పైప్ లైన్ పనులు ప్రారంభం
NRPT: మక్తల్ మున్సిపాలిటీ 16వ వార్డులో అమృత స్కీం కింద పైప్ లైన్ పనులను బుధవారం వార్డ్ కౌన్సిలర్ అల్కోరి పావని ప్రారంభించారు. మిషన్ భగీరథ పనులు ఇప్పటికే పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, ఇప్పుడు అమృత్ స్కీం కింద వాటర్ ట్యాంకుల నుంచి నేరుగా పైప్‌లైన్లు కలిపే పనులు చేపడుతున్నామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.