రూ.152 కోట్ల మోసం.. 9 మంది అరెస్ట్
NZB: జిల్లా IV టౌన్ పోలీసులు, సైబర్ క్రైమ్ బృందం ప్రత్యేక ఆపరేషన్‌లో 9 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు CP సాయి చైతన్య తెలిపారు. తప్పుడు పత్రాలతో అక్రమంగా ఓ బ్యాంక్‌లో ఖాతాలు తెరిచి రూ.152 కోట్లు లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. ఈ కేసుకు సంబంధించి గతంలో ఏడుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.