'ఫారం 6, 7, 8 అప్లికేషన్లు త్వరగా పరిష్కరించాలి'
WNP: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పెండింగ్లో ఉన్న ఫారం 6, 7, 8 అప్లికేషన్లను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2025 ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు.