ఎస్సీ బాలుర వసతిగృహంలో విద్యార్థులకు వన భోజనాలు

ఎస్సీ బాలుర వసతిగృహంలో విద్యార్థులకు వన భోజనాలు

GDWL: మానవపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతిగృహంలో విద్యార్థులకు వన భోజనాలు ఏర్పాటు చేశారు. కలెక్టర్ బీఎం సంతోష్ ఆదేశాల మేరకు, వసతిగృహ విద్యార్థులకు ఒత్తిడి తగ్గించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వార్డెన్ రాంగోపాల్ అన్నారు. అరకిలోమీటర్ దూరంలో మొక్కల పెంపక క్షేత్రానికి తీసుకొచ్చి విద్యార్థులకు ఆటలు, పాటలు నిర్వహించి మధ్యాహ్న భోజనంను అక్కడే ఏర్పాటు చేశారు