హాస్టల్ తనిఖీ చేసిన డిప్యూటీ డైరెక్టర్
NLR: కలువాయి మండలం దాచూరు గ్రామంలోని బాలుర వసతి గృహాన్ని శనివారం సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి కే. శోభారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహానికి సంబంధించిన రికార్డులను, పరిసరాలను ఇతర మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులను అడిగి వసతి గృహంలోని పరిస్థితులను తెలుసుకున్నారు.