వేతనాలు చెల్లించాలని కమిషనరేట్ ముట్టడి

KMR: పంచాయతీ ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురువారం హైదరాబాదులోని కమీషనరేట్‌ను ముట్టడించారు. తమకు మూడు నెలల వేతనాలు చెల్లించడం లేదని ఈ నెల 19 నుంచి శాంతియుత విధానంలో విధులు బహిష్కరించినా ప్రభుత్వం తమను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.