చంద్రగ్రహణం ఎఫేక్ట్.. ఆలయాలు మూసివేత..!
ADB: చంద్రగ్రహణం కారణంగా రాష్ట్రాల్లోని ఆలయాలు అన్నీ మంగళవారం మూతపడనున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ దర్శనాలను ఉ.9 నుంచి రాత్రి 7.30 వరకు నిలిపివేస్తారు. మరోవైపు తెలంగాణలోని యాదగిరిగుట్ట ఆలయాన్ని ఉ.7 గంటలకే మూసివేస్తామని తిరిగి బుధవారం తెరవనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. రేపు నిర్వహించాల్సిన హోలికోత్సవాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించనున్నట్లు తెలిపింది.