VIDEO: గ్రామంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు
PDPL: అంతర్గాం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫ్రీ మెడికల్ క్యాంప్‌ను గ్రామ సర్పంచ్ అంగోతు రవికుమార్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్యులు గ్రామంలోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. సర్పంచి రవి నాయక్ మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన సేవలను అందించేందుకు నిరంతరం అందుబాటులో ఉంటున్నానన్నారు.