సమ్మక్క, సారలమ్మలకు మంత్రులు ప్రత్యేక పూజలు

సమ్మక్క, సారలమ్మలకు మంత్రులు ప్రత్యేక పూజలు

MLG: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారక్క వనదేవతలను ఇవాళ రాష్ట్ర మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫిబ్రవరి నెలలో జరుగు మినీ మేడారం జాతర ఉత్సవాల ఏర్పాట్లపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు.