కంచికచర్ల బస్టాండ్‌లో పెరిగిన ప్రయాణికుల రద్దీ
NTR: కంచికచర్ల బస్టాండ్‌లో గురువారం ప్రయాణికుల రద్దీ భారీగా కనిపించింది. వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సుల కోసం ప్రయాణికులు ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్సుల సంఖ్యను పెంచాలని, ప్రత్యేక సర్వీసులు నడపాలని ప్రయాణికులు అధికారులను కోరారు.