అప్పన్న సన్నిధిలో వీఎంఆర్డీఏ కమిషనర్
VSP: వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ గురువారం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ద్వారా వేదాశీర్వచనం పొందగా, ఆలయ పర్యవేక్షణ అధికారి బి.సత్య శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో శేష వస్త్రం, ప్రసాదాలు అందజేశారు.