VIDEO: ఉపాధ్యాయురాలి ఇంట్లో చోరీ

VIDEO: ఉపాధ్యాయురాలి ఇంట్లో చోరీ

కృష్ణా: మచిలీపట్నం తోట ప్రాంతంలో ఉపాధ్యాయురాలు నిమ్మగడ్డ మార్క్ రేట్ నివాసంలో చోరీ జరిగింది. గుడ్లవల్లేరు(M) కౌతరం ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆమె బుధవారం ఉదయం ఇంటికి తాళం వేసి పాఠశాలకు వెళ్లారు. ఇంటిలో ఎవరూ లేకపోవడాన్ని గమనించిన దుండగులు ఇంటి తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు.పోలీసులు క్లూస్ టీం, సహాయంతో దర్యాప్తు చేపట్టారు.