ముఖ్యమంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత
BPT: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. వేమూరు నియోజకవర్గంలోని సురేపల్లి గ్రామంలో గురువారం జరగనున్న పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి బందోబస్తు విధులపై జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి బ్రీఫింగ్ నిర్వహించారు.