కలెక్టరేట్ నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్

NRPT: నారాయణపేట పట్టణ శివారులో సింగారం వద్ద నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన పనులను బుధవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన నిర్మాణ పనులను ఆర్అండ్‌బీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని రూ. 55 కోట్లతో కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. పనుల్లో వేగం పెంచి పూర్తి చేయాలని అన్నారు.