VIDEO: బైక్ ఆటో ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

VIDEO: బైక్ ఆటో ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

WGL: పర్వతగిరి మండలం సోమారం గ్రామంలో బైక్‌ను ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి బాధితులను చికిత్స నిమిత్తం 108వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.