VIDEO: దేవరకొండలో భారీ వర్షం
NLG: దేవరకొండ నియోజకవర్గం వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. దిండి ప్రాజెక్టు అలుగు పోస్తున్నది. నియోజకవర్గం పరిధిలోని దిండి వాగు, తాటికోళ్ వాగు, మైనంపల్లి వాగు, ఉప్పు వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండగా, చెరువులు కుంటలు అన్ని పూర్తిగా నిండి అలుగులు పోస్తున్నాయి.