విద్యార్థి రోజా కుటుంబానికి పరామర్శ

విద్యార్థి రోజా కుటుంబానికి పరామర్శ

మహబూబాబాద్: కురవి ఏకలవ్య పాఠశాలలో ఇటీవల నృత్యం చేస్తూ మృతి చెందిన సపావట్ రోజా కుటుంబాన్ని డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ నేడు పరామర్శించారు. తానంచర్ల శివారు సపావట్ తండాలో మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్ధికసహాయం అందించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.