'రోడ్డుపై పశువులతో ప్రమాదాలు'
ASR: రాత్రి సమయాల్లో పశువులను రోడ్డు మీదకు వదిలేయవద్దని, కట్టి ఉంచాలని కొయ్యూరు ఎస్సై పీ.కిషోర్ వర్మ పశువుల యజమానులకు సూచించారు. హైవేపైన పశువులు తిష్టవేసి ఉండడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. రోడ్లపైనే పశువులు ఉండడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుందన్నారు.