ఈనెల 27న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

SRD: జిల్లాలో ఈనెల 27న నిర్వహించే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. జిల్లాలో 10 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.