సీఎం సభలో యువనేత మిథున్ రెడ్డికి సముచిత గౌరవం
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన బహిరంగ సభలో మహబూబ్నగర్ నియోజకవర్గానికి చెందిన యువ నాయకులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డికి సముచిత గౌరవం కల్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిథున్ రెడ్డిని ఆప్యాయంగా పలకరించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మిథున్‌తో వేదికను మంత్రులు రాజనర్సింహ, శ్రీహరి అలంకరించారు.