ఎమ్మెల్యేను కలిసిన చింతలూరు నూతన సర్పంచ్
NZB: జక్రాన్ పల్లి మండలంలోని చింతలూరు గ్రామానికి చెందిన నూతన సర్పంచ్ వార్డు సభ్యులుకు మంగళవారం ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే సర్పంచ్ నాగుల శ్రీనివాస్‌ను వార్డు సభ్యులను శాలువాలతో సన్మానిస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో చింతలూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.