VIDEO: చిట్యాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
NLG: హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై గత రెండు రోజులుగా భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. చిట్యాల రైల్వే వంతెెన కిందకు మొన్న కురిసిన వర్షాలకు భారీస్థాయిలో వరదనీరు చేరింది. ఫలితంగా నిన్న రాత్రి చిట్యాల నుంచి పెదకాపర్తి వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.