రైతులకు నానో యూరియాపై అవగాహన

యాదాద్రి: ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు నానో యూరియా వాడకంపై మంగళవారం అవగాహన కల్పించారు. మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్, నానో యూరియా ప్రయోజనాలు, వాడే విధానం గురించి వివరించి, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. అర లీటరు నానో యూరియా బస్తా యూరియాతో సమానమని, దీని వాడకంతో దిగుబడి పెరిగి, వృథా తగ్గుతుందని తెలిపారు.