శాంతిభద్రతలకు పోలీసుల కఠిన చర్యలు

శాంతిభద్రతలకు పోలీసుల కఠిన చర్యలు

కృష్ణా: జిల్లాలో శాంతిభద్రతలకు జిల్లా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ వంటి నేరాల్లో పాల్గొంటూ ప్రజా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్న నేరస్థులపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. అటువంటి నేరస్తులు, సస్పెక్ట్ షీట్ హోల్డర్స్, రౌడీ షీటర్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టారు. అలాంటి సంఘటనల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు.