వైరాలో పండుగ రోజూ తీరని గ్యాస్ తిప్పలు
KMM: వైరా మండలం సోమవరం గ్రామం సమీపంలోని ఇండియన్ గ్యాస్ వద్ద గ్యాస్ కొరతతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులుగా గ్యాస్ కోసం తిరుగుతున్నా కాణిపాకం గ్యాస్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండగ సమయంలో గ్యాస్ లేక తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. వెంటనే సరఫరా చేయాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.