అంబేద్కర్‌కు నివాళులర్పించిన మార్కాపురం JAC

అంబేద్కర్‌కు నివాళులర్పించిన మార్కాపురం JAC

ప్రకాశం: మార్కాపురం జిల్లా JAC ఆధ్వర్యంలో కోర్ట్ సెంటర్ ప్రాంగణంలో గల డా. బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ ప్రాంత ప్రజల పోరాట ఫలితమే మార్కాపురం జిల్లా ఏర్పాటు అవుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఎంపీజే తదితర నాయకులు పాల్గొన్నారు.