రోడ్డు డైవర్షన్ ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ .వి. పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద రోడ్డు డైవర్షన్ పాయింట్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదావరిలో వరద నీటిమట్టం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 100కు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు.