రుషికొండ భవనాల వినియోగంపై నివేదిక సిద్ధం
AP: విశాఖ రుషికొండ భవనాల వినియోగంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ తమ అధ్యయన తుది నివేదికను సిద్ధం చేసింది. సచివాలయంలోని మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయంలో సబ్ కమిటీ ఐదోసారి భేటీ అయ్యింది. రుషికొండ ప్యాలెస్‌ను ప్రజల సందర్శనకు అనుమతించడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే దిశగా చర్చలు జరిగాయి. సీఎం ఆదేశాల మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.