ఆర్థిక వివాదం.. యువకుడి హత్య

GNTR: తాడేపల్లిలో ఓ యువకుడి హత్య కలకలం రేపింది. ఆదివారం జరిగిన హత్యపై స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్థిక వివాదంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అది హత్యకు దారితీసిందన్నారు. భరత్ అనే యువకుడు వర్ధన్ అనే యువకుడిని కత్తితో పొడవడంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ వర్ధన్ సోమవారం మృతిచెందాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.