ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం: కమిషనర్

KMM: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య తెలిపారు. సోమవారం ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 34 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలన్నారు.