'శీతాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి'
MDK: శీతాకాలంలో రహదారులపై వాహనదారులు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ డీవి శ్రీనివాస రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా పరిధిలో శీతాకాలం తీవ్రత, ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు పేరుకు పోవడం వల్ల రహదారులపై ముందు ఉన్న వాహనాలు కనిపించకపోవడం వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇలాంటి సమయాల్లో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.