రాఖీ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

MBNR: జిల్లాలోని బ్రహ్మకుమారిలు ఈశ్వరయ్య విద్యాలయ భవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు హాజరైన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి బ్రహ్మకుమారి ప్రతినిధులు రాఖీ కట్టి శుభాకాంక్షలు చెప్పారు. అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ల ఆప్యాయత అనురాగాలకు రాఖీ పండుగ ప్రతీక అని ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.