నేడే ప్రమాణ స్వీకారం

నేడే ప్రమాణ స్వీకారం

VKB: నేడు కొడంగల్ మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్. ప్రశాంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు మున్సిపల్ కార్యవర్గం కొలువుదీరడానికి సర్వం సిద్ధమైంది. మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. కొత్త పాలకవర్గం బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో స్థానికంగా సందడి నెలకొంది. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు భారీగా హాజరుకానున్నారు.