త్రివర్ణ శోభితమైన రామప్ప దేవాలయం

త్రివర్ణ శోభితమైన రామప్ప దేవాలయం

MLG: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం త్రివర్ణ శోభితమైంది. ఈనెల 15న జరిగే స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రామప్ప ఆలయం మొత్తాన్ని మూడు రంగులతో కూడిన విద్యుత్ వెలుగులతో అలంకరించారు. రాత్రి వేళల్లో ఈ దృశ్యాలు స్థానికులను, పర్యటకులను కట్టిపడేస్తున్నాయి. ఈ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో బంధించుకుంటున్నారు.