VIDEO: పుష్కర ఘాట్ వద్ద కరగని గణనాథుని ప్రతిమలు

W.G: వినాయక చవితికి చాలాచోట్ల ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) విగ్రహాలను ఏర్పాటు చేశారు. నిమజ్జనం తర్వాత అవి నీటిలో కరగకుండా ఇలాగే ఉండిపోవడంతో పర్యావరణానికి ముప్పుగా మారుతున్నాయి. యలమంచిలి మండలం చించినాడ పుష్కర ఘాట్ వద్ద నదిలో ఈ దృశ్యాలు కనిపించాయి. కాలుష్యం నివారించేందుకు వచ్చే ఏడాది నుంచి మట్టి గణపతులను మాత్రమే ప్రతిష్టించాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు.