23న వనపర్తి రేషన్ బియ్యం బహిరంగ వేలం

WNP: జిల్లాలో పౌరసరఫరాల శాఖ అధికారులు జప్తు చేసిన 1253.60 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని ఈనెల 23న బహిరంగ వేలం ద్వారా అమ్మనున్నట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వ్యాపారులు రూ.10,000 విలువైన డిమాండ్ డ్రాఫ్ట్ (DD)ను అదనపు కలెక్టర్ పేరుపై తీసుకుని వేలంపాటలో పాల్గొనాలని సూచించారు.