రేపు చిత్తూరు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్

రేపు చిత్తూరు కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్

CTR: జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం సూచించారు. ఈ మేరకు ఉదయం 9: 30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. దీంతో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటారన్నారు. అయితే బాధితులు వారి సొంత మండలాల్లోనూ ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు.