పంటలను నాశనం చేస్తున్న కరిరాజులు
PPM: గత కొన్ని రోజులు నాగావళి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న కరిరాజుల గుంపు గురువారం మండలంలోని బాసంగి, వెంకటాపురం, పాత బిత్రపాడు, పాత నిమ్మ లపాడు గ్రామాల్లో సంచరించాయని స్థనికులు తెలిపారు. అరటి, మొక్కజొన్న పంటలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే ఏనుగులను తరలించాలని గ్రమస్తులు కోరుతున్నారు