రైతుల సమస్యలపై ఎంపీ ప్రశ్న

రైతుల సమస్యలపై ఎంపీ ప్రశ్న

WGL: పంట భీమా చెల్లింపుల్లో ఆలస్యం, రైతుల సమస్యలపై ఎంపీ కడియం కావ్య పార్లమెంటులో ప్రశ్నించారు. ఖరీఫ్ సీజన్ మొదలవుతున్న తరుణంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయని, ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ కోరారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, రైతు సంక్షేమానికి కృషి చేయాలని ఎంపీ అన్నారు.