VIDEO: రోడ్డు ప్రమాదం.. భర్త మృతి, భార్యకు తీవ్రగాయాలు
అన్నమయ్య: బైకును కారు ఢీకొట్టిన ఘటన సంబెపల్లి మండలం మోటుకు వాండ్లపల్లి సబ్‌స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. దంపతులు బైకుపై ప్రయాణిస్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా, ఆయన భార్య తీవ్రంగా గాయపడ్డారు. గాయాలైన భార్యను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.