ఐక్యత, సమగ్రత కోసం 'రాష్ట్రీయ ఏక్తా దివస్'
రాష్ట్రీయ ఏక్తా దివస్(జాతీయ ఐక్యతా దినోత్సవం)ను ఏటా అక్టోబర్ 31న జరుపుకుంటారు. భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దీనిని నిర్వహిస్తారు. స్వాతంత్య్రం తర్వాత 500కు పైగా స్వదేశీ సంస్థానాలను పటేల్ భారత్‌లో విలీనం చేసి, దేశాన్ని ఏకీకృతం చేశారు. ఆయన సేవలను స్మరించుకుంటూ.. దేశ ఐక్యత, సమగ్రత, భద్రతపై అవగాహన పెంచడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం.