ఆలయాభివృద్ధికి నా వంతు కృషి చేశా: ఈవో

GDWL: అలంపూర్ ఐదో శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర దేవస్థానం ఈవోగా మూడున్నర సంవత్సరాలు సుదీర్ఘకాలంగా పదవిలో ఉండి శనివారం పురేంద్ర కుమార్ జమ్మలమ్మ ఆలయానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవస్థానం ఈవోగా మూడు ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో పనిచేస్తూ వాటిలో జోగులాంబ ఆలయం అభివృద్ధిలో పాలకమండలి, స్వచ్ఛమైన శుద్ధి జలాల కోసం బోర్లు వేయించాడానికి కృషి చేశానన్నారు.