కృష్ణ జలాల నుంచి బయటపడిన సంగమేశ్వరాలయం

కృష్ణ జలాల నుంచి బయటపడిన సంగమేశ్వరాలయం

KRNL: కొత్తపల్లె మండలంలోని సంగమేశ్వర ఆలయం జలం నుంచి పూర్తిగా బయటపడింది. ఆలయ అర్చకులు స్వామికి ప్రథమ పూజ చేశారు. నేటి నుంచి భక్తుల సందర్శనార్థం ఆలయం తెరచి ఉంటుందని తెలిపారు. కృష్ణ జలాల నుంచి ప్రతి సంవత్సరం వేసవికాలంలో ఈ ఆలయం బయటపడుతుంది. మూడు నెలల పాటు భక్తుల చేత విశేష పూజలు అందుకుంటుందని, తదనంతరం జులై మాసంలో జలదిగ్బంధంలోకి వెళ్తుందని స్థానికులు తెలిపారు.