యూరియా కొరతపై కాంగ్రెస్ నిరసన

యూరియా కొరతపై కాంగ్రెస్ నిరసన

ASR: అరకులోయ మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూరియా కొరతతో తీవ్రంగా ఎదురవుతున్న రైతుల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఛైర్మన్ పాంగి గంగాధర్ నేతృత్వంలో ఈ ధర్నా చేపట్టారు. రైతులకు ఉచితంగా యూరియా సరఫరా చేయాలని తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.