ఎమ్మెల్యే కృష్ణారావుకు అరికపూడి సవాల్

ఎమ్మెల్యే కృష్ణారావుకు అరికపూడి సవాల్

TG: ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ బహిరంగ సవాల్ విసిరారు. 2009 నుంచి ఇద్దరి ఆస్తులపై విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. తాను సిట్టింగ్ జడ్జి, ఈడీ విచారణకు సిద్ధమన్నారు. సర్వే నెంబర్ 307లో తన కుటుంబ సభ్యులు 9 మంది కలిసి కొనుగోలు చేసిన భూమి అది అని అన్నారు. ఎమ్మెల్యే మాధవరం ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు.